”2021 జూలైలో ఒలింపిక్స్ ఖచ్చితంగా జరుగుతాయి”

|

Sep 07, 2020 | 8:33 PM

కోవిడ్ ఉన్నా, లేకున్నా 2021 జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ చెప్పారు.

2021 జూలైలో ఒలింపిక్స్ ఖచ్చితంగా జరుగుతాయి
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో మొదలు కావాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.  ఈ క్రీడలకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) కొత్త తేదీలను కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది(2021) జూలై 23వ తేదీ నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ ప్రారంభం కానుందని.. ఆగస్టు 8వ తేదీన ముగియనుందని ఐఓసీ స్పష్టం చేసిన విషయం విదితమే. అంతేకాకుండా 2021 ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్‌5 వరకూ పారా ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు.

ఇక ఈ ఒలింపిక్స్ నిర్వహణపై తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ స్పందించారు. కోవిడ్ ఉన్నా, లేకున్నా 2021 జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని తేల్చి చెప్పారు. 2011 సునామీ వినాశనం తర్వాత ఈ క్రీడలు దేశ పునర్నిర్మాణానికి చిహ్నంగా నిలుస్తాయి. ఇప్పుడు కరోనా మహమ్మారిని సైతం జయించి ముందుకుకెళ్తాయి. చీకట్లను తరిమికొట్టి.. వెలుగును చూసేందుకు దగ్గరలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. (Tokyo Olympics Confirm Next Year)

Also Read:

 ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..