తెలంగాణలో.. రాగల 2 రోజులు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు!

తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కోస్తా

తెలంగాణలో.. రాగల 2 రోజులు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 5:54 PM

తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కోస్తా తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా.. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కోమరంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: మహారాష్ట్రలో.. 23 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. 

Latest Articles