Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దొంగ డ్యాన్స్.. ఎందుకు చేశాడో తెలిస్తే..

| Edited By: Sanjay Kasula

Apr 19, 2022 | 3:44 PM

యూపీలో ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చందౌలీ జిల్లాలో జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు. దొంగ తీరు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది.

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దొంగ డ్యాన్స్.. ఎందుకు చేశాడో తెలిస్తే..
Funny Robbery In Chandauli
Follow us on

యూపీలో ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చందౌలీ జిల్లాలో జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు. దొంగ తీరు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. చోరీ కోసం షాపులోకి వెళ్లిన దొంగ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లా ఎస్పీ ఇంటి పక్కన ఉన్న దుకాణంలోనే చోరీ చేయడంలో సఫలమైన ఓ దొంగ.. అంతులేని ఆనందంలో మునిగిపోయాడు. ఆ సంతోషంతో షాప్​లోనే సీసీటీవీ కెమెరా ముందే డ్యాన్స్​ చేశాడు. అలా నృత్యం చేసుకుంటూనే బయటకు వెళ్లిపోయాడు. షాప్ లోని వస్తువులు చూసి దొంగ డ్యాన్స్ చేస్తూ కనిపించిన చిత్రాలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో దొంగ దుకాణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను చూసి తెగ మురిసి పోయాడు. పని పూర్తయిన తర్వాత దొంగ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దొంగ చేస్తున్న డ్యాన్స్ వీడియో షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. తన ముఖానికి తెల్లటి ముసుగు వేసుకుని ఉన్న ఈ దొంగ కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత  షాప్ కొద్దిగా తెరిచిన షట్టర్ కింద నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.చోరీ చేసిన తర్వాత దొంగ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.  ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా చందౌలీ పోలీస్ అధికారులు తెలిపారు. అన్ని ఆధారాల సేకరించినట్లుగా వెల్లడించారు. వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..