
ఒంగోలు నగరంలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజూమున చోరీ జరిగింది. గుడి తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అనంతరం హుండీ తాళాలు పగులగొట్టి నగదు తీసుకుని పరారయ్యారు. హుండీలోని ముడుపులను ఎత్తుకెళ్లి గుడి వెనుక తీరిగ్గా విప్పదీసి అందులోని డబ్బులు, వస్తువులు తీసుకుని ఉడాయించారు. ఉదయం గుడి తలుపులు తెరిచేందుకు వచ్చిన నిర్వాహకులు తాళాలు పగల గొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గుడి తలుపులు, హుండీ తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్
ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు