చైనా రేసింగ్ పావురానికి యమ క్రేజీ.. ఆన్‌లైన్ వేలంలో దాదాపు రూ.10 కోట్లు పలికిన బెల్జియం కపోతం

|

Nov 16, 2020 | 2:32 PM

#Racing Pigeon Price: ఆర్థికంగా బాగా సంపాదించినవాళ్లు ఏదైన వస్తువును కొంటారు. లేదా ఓ ఫ్లాటో, బిల్డింగో, లేక ఏదైన ఓ స్థిరాస్తి కొంటారు. దానికి వెనుక ముందు ఆలోచించి దాని వల్ల భవిష్యత్ లెక్కలు వేసుకుని మరీ, కొంటాం. అంతే కానీ రూ.10 కోట్లు పెట్టి ఎవరైనా పావురం కొంటారా? మనకు తెలిసి ఎవ్వరూ కొనరు. అయితే చైనాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా రూ.10 కోట్లు పెట్టి ఒక పావురం కొనుగోలు చేశాడు. ఈ […]

చైనా రేసింగ్ పావురానికి యమ క్రేజీ.. ఆన్‌లైన్ వేలంలో దాదాపు రూ.10 కోట్లు పలికిన బెల్జియం కపోతం
Follow us on

#Racing Pigeon Price: ఆర్థికంగా బాగా సంపాదించినవాళ్లు ఏదైన వస్తువును కొంటారు. లేదా ఓ ఫ్లాటో, బిల్డింగో, లేక ఏదైన ఓ స్థిరాస్తి కొంటారు. దానికి వెనుక ముందు ఆలోచించి దాని వల్ల భవిష్యత్ లెక్కలు వేసుకుని మరీ, కొంటాం. అంతే కానీ రూ.10 కోట్లు పెట్టి ఎవరైనా పావురం కొంటారా? మనకు తెలిసి ఎవ్వరూ కొనరు. అయితే చైనాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా రూ.10 కోట్లు పెట్టి ఒక పావురం కొనుగోలు చేశాడు.

ఈ రేసింగ్‌ పావురం ధర 1.6 మిలియన్‌ యూరోలు అంటే అది మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.14.11 కోట్లు . బెల్జియంలోని పిపా అనే సంస్థ ఇటీవల పోటీల్లో పాల్గొనే పావురాలను వేలం వేసింది. ఇందులో ఐదేళ్ల వయసున్న ‘న్యూ కిమ్‌’ అని పిలిచే ఈ ఆడ కపోతాన్ని ఓ వ్యక్తి రూ 10 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు.

మరికొందరికి కార్లు అంటే పిచ్చి కావొచ్చు. ఇంకొందరికి ప్రపంచం చుట్టేయడమంటే ఇష్టం ఉండొచ్చు. ఎవరైనా వారి వారి ఇష్టాల కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ ఈయనకు పావురం అంటే ఇష్టం అనుకుంటా? అందుకే రూ.10 కోట్లు పోసి మరీ పావురాన్ని కొన్నాడు. ఈయన కొన్న పావురం పేరు అర్మండో. మార్చి 17న బెల్జియంలోని ఒక పీజియన్ రేసింగ్ వెబ్‌సైట్ అర్మండో‌కు వేలం నిర్వహించింది. వేలం ధర 1.4 మిలియన్ డాలర్లకు చేరింది. జోయెల్ వెర్షూట్ ఈ పావురాన్ని విక్రయించారు.

ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి పావురాన్ని కొనుగోలు చేశారంటే.. బెల్జియం ఫాస్టెస్ట్ లాంగ్ డిస్టెన్స్ రేసింగ్ పీజియన్‌గా అర్మండో రికార్డ్ సృష్టించింది. ఇది చాలా రేస్‌లలో గెలుపొందింది. దీని వయసు ఐదేళ్లు. అంటే రిటైర్మెంట్‌కు దగ్గరిలో ఉంది. అయినా కూడా దీనికి ఇప్పటికీ చాలా విలువ ఉంది. అసాధారణమైన రెక్కల బలం, గమ్యాన్ని గుర్తించడం వంటివి అంశాలు అర్మండోను ప్రత్యేకంగా నిలిపాయి. అయితే వేలంలో పావురాన్ని గెలుచుకున్న వ్యక్తి ప్రపంచాన్ని జయించినంత సంతోషాన్ని వ్యక్తం చేశారు.