
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా ఎఫెక్ట్ ప్రఖ్యాత హజ్ యాత్రపై కూడా పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా హజ్ యాత్రకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ యాత్రకు చెందిన ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, ఈ క్రమంలో ఈ ఏడాది యాత్ర రద్దయినట్లేనని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా, ఎగ్జిగ్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా తెలిపారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారని.. మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్ కమిటీ వద్ద ఉందని షఫీవుల్లా తెలిపారు. హజ్ యాత్ర రద్దు అయిన నేపథ్యంలో యాత్రికులకు కేంద్ర హజ్ కమిటీ వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందని ఆయన తెలిపారు. యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
Read This Story Also:Breaking: ఏపీ హైకోర్టు కొత్త ప్రభుత్వ న్యాయవాదులు వీరే..!