‘అది రాహుల్ గాంధీ అభిప్రాయం’, కమల్ నాథ్

బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అది దురదృష్టకరమని వ్యాఖ్యానించగా..అది ఆయన అభిప్రాయమని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ సింపుల్ గా పేర్కొన్నారు. ఒక సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా కుమారుడు అన్న ధ్యాస కమల్ నాథ్ లో కనిపించలేదంటున్నారు. ఇమ్రతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అని కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య ఇంకా రచ్ఛ రేపుతూనే ఉంది. ఏమైనా.. తాను […]

అది రాహుల్ గాంధీ అభిప్రాయం, కమల్ నాథ్

Edited By:

Updated on: Oct 20, 2020 | 5:57 PM

బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అది దురదృష్టకరమని వ్యాఖ్యానించగా..అది ఆయన అభిప్రాయమని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ సింపుల్ గా పేర్కొన్నారు. ఒక సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా కుమారుడు అన్న ధ్యాస కమల్ నాథ్ లో కనిపించలేదంటున్నారు. ఇమ్రతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అని కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య ఇంకా రచ్ఛ రేపుతూనే ఉంది. ఏమైనా.. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని, ఎవరినీ అవమానించాలన్నది తన ఉద్దేశం కానప్పుడు ఇక అపాలజీ  ప్రసక్తి ఏమిటని కమల్ నాథ్ మంగళవారం పేర్కొన్నారు. ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని తాను ఇదివరకే స్పష్టం చేశానన్నారు. ఇక దీనిపై వివాదం అనవసరమని పరోక్షంగా వ్యాఖ్యానించారు.