ఏసీబీ డీజీగా జే పూర్ణ‌చంద‌ర్‌రావు.. ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించాయి. గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డీజీలుగా ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

  • Subhash Goud
  • Publish Date - 2:53 pm, Tue, 29 December 20
ఏసీబీ డీజీగా జే పూర్ణ‌చంద‌ర్‌రావు.. ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించాయి. గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డీజీలుగా ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న గోపీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది. డీజీపీ హోదాలో ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఎం గోపీకృష్ణ నియామ‌కం అయ్యారు. అలాగే అవినీతి నిరోధక శాఖ డైరెనక్టర్ జనరల్ గా జే. పూర్ణచందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పూర్ణచందర్ రావుకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్