తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,214 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 8 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. అలాగే మొత్తం మృతుల సంఖ్య 1135గా నమోదు అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో 29,058 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స పొంది 1,63,407 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అలాగే 23,702 మంది హోం ఐసోలేషన్లలో ఉన్నారు. జీహెచ్ఎంసీలో 305, కరీంనగర్ 106, మేడ్చల్ 153, నల్లగొండ 149, రంగారెడ్డి 191 వరంగల్ అర్బన్ జిల్లాలో 131, కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో రికవరీ రేటు 84.4% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.51% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,443 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 30,50,444 పరీక్షలు చేసారు. అయితే, తాజాగా రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.