తెలంగాణలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 661 పాజిటివ్ కేసులు, 3 మరణాలు

| Edited By:

Nov 15, 2020 | 11:14 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.  రాష్ట్రంలో కొత్తగా 661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరింది.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 661 పాజిటివ్ కేసులు, 3 మరణాలు
Follow us on

తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.  రాష్ట్రంలో కొత్తగా 661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరింది. వైరస్‌తో తాజాగా ముగ్గురు ప్రాణాలు విడువగా…​ మొత్తం మరణాల సంఖ్య 1,404కు పెరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వైరస్​ నుంచి తాజాగా 1,637 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,40,545 మంది కరోనాను జయించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 15,425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 12,888 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ జిల్లాలో 45 కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Also Read :

పిఠాపురంలో అగ్నిప్రమాదం..తారాజువ్వ పడి కోళ్ల ఫారం‌ దగ్ధం, అగ్నికి ఆహుతైన 1200 కోళ్లు

నేడు బిహార్లో ఎన్డీయే పక్షాల సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ, ఆ ఫార్ములాలతో ముందుకు !

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !