నేడు యాదాద్రికి కేసీఆర్.. అభివృద్ధి పనులపై సమీక్ష

| Edited By:

Dec 17, 2019 | 10:18 AM

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో కొత్త సౌకర్యాల నిర్మాణం మరియు ఆలయ అభివృద్ధి గురించి ఆయన సమీక్షించనున్నారు. త్వరలో ఈ ఆలయంలో కేసీఆర్ మహా సుదర్శన నారసింహ యాగం నిర్వహించనున్నారు. యాగాన్ని అత్యంత వైభవంగా జరుపుతామని సీఎం తెలిపారు. ఫిబ్రవరిలో నిర్వహించే మహా సుదర్శన యాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ సీఎం. ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో […]

నేడు యాదాద్రికి కేసీఆర్.. అభివృద్ధి పనులపై సమీక్ష
Follow us on

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో కొత్త సౌకర్యాల నిర్మాణం మరియు ఆలయ అభివృద్ధి గురించి ఆయన సమీక్షించనున్నారు. త్వరలో ఈ ఆలయంలో కేసీఆర్ మహా సుదర్శన నారసింహ యాగం నిర్వహించనున్నారు. యాగాన్ని అత్యంత వైభవంగా జరుపుతామని సీఎం తెలిపారు. ఫిబ్రవరిలో నిర్వహించే మహా సుదర్శన యాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ సీఎం. ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో పాటు రానున్నారు.

గుట్టపై అభివృద్ధి పనులు ఎంత మేర పూర్తయ్యాయి? పనులన్నీ అనుకున్న విధంగా సాగుతున్నాయా? మహా సుదర్శన యాగం ఎక్కడ నిర్వహించాలి? ఇలాంటి అంశాలపై ఆరా తీసేందుకు ఇవాళ యాద్రాద్రికి వెళ్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యాదాద్రిపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. యాదాద్రిని ఊహకందని స్థాయిలో అభివృద్ధి చేశారు.