మరో భారీ అవినీతికి తెరతీసిన జగన్ సర్కార్ : అయ్యన్న

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 11:45 AM

రోడ్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ) శాఖలో మరో భారీ అవినీతికి జగన్ ప్రభుత్వం తెర తీసి౦దన్నారు TDP మాజీ మ౦త్రి అయ్యన్న పాత్రుడు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు వేల కోట్ల నిధులు మంజూరు అయ్యాయని….అయితే ప్రస్తుతమున్న టెండర్ల విధానం స్థానే బై హ్యాండ్ పద్ధతి ద్వారా రూ. 6,400ల కోట్లు స్వంత కంపెనీలు, అనుచరులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రాంగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలోని […]

మరో భారీ అవినీతికి తెరతీసిన జగన్ సర్కార్ : అయ్యన్న
Follow us on

రోడ్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ) శాఖలో మరో భారీ అవినీతికి జగన్ ప్రభుత్వం తెర తీసి౦దన్నారు TDP మాజీ మ౦త్రి అయ్యన్న పాత్రుడు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు వేల కోట్ల నిధులు మంజూరు అయ్యాయని….అయితే ప్రస్తుతమున్న టెండర్ల విధానం స్థానే బై హ్యాండ్ పద్ధతి ద్వారా రూ. 6,400ల కోట్లు స్వంత కంపెనీలు, అనుచరులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రాంగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలోని రాయలసీమకు చెందిన ఒక మంత్రి తనయుడుకు దీనిలో ప్రమేయం ఉందన్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేసారు.