విజయసాయికి నోటీసులు ఇస్తారా.. లేదా?

అంతర్వేది రధానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి 91 సీఆర్పీసీ క్రింద నోటీసులు ఇస్తారా.. లేదా ? అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య...

విజయసాయికి నోటీసులు ఇస్తారా.. లేదా?

Updated on: Sep 10, 2020 | 5:27 PM

అంతర్వేది రధానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి 91 సీఆర్పీసీ క్రింద నోటీసులు ఇస్తారా.. లేదా ? అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. లేదంటే మన ఎంపీ గారేలే అని వూరుకుంటారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీ కి ఒక న్యాయం, ప్రతి పక్షాలకు ఒక న్యాయమా? ఇదేనా మీ ప్రభుత్వ విధానం? అంటూ జగన్ సర్కారుని నిలదీసే ప్రయత్నం చేశారు వర్ల. ఇలా ఉండగా, నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై అనేక విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.’ అంటూ చేసిన ఆరోపణలపై వర్ల పై విధంగా స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us