టీడీపీ నేత నారాయణ, అతని కుటుంబసభ్యులపై దుండగులు దాడి, కాపుకాచి మార్గం మధ్యలో దుశ్చర్య

కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ప్రముఖ టీడీపీ నేత నారాయణ ఆయన భార్య, సోదరుడు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు...

టీడీపీ నేత నారాయణ, అతని కుటుంబసభ్యులపై దుండగులు దాడి, కాపుకాచి మార్గం మధ్యలో దుశ్చర్య

Updated on: Jan 05, 2021 | 2:33 PM

కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ప్రముఖ టీడీపీ నేత నారాయణ ఆయన భార్య, సోదరుడు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి–గుంతకల్ గ్రామాల మధ్య దుండగులు కాపుకాచి దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో వారి వెంబడి ప్రయాణిస్తోన్న శుభ కార్యక్రమానికి వెళ్తున్న వాహనశ్రేణి, నారాయణ వాహనాన్ని సమీపించే లోపు దాడిచేసి దుండగులు పరారయ్యారు. తర్వాత అక్కడికి చేరుకున్న బంధువులు, నారాయణ, అతని భార్య, సోదరుడ్ని అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కూడా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us