‘కూతుళ్లను కూడా నాని అలాగే తిప్పుతున్నారా?’

వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలినాని పై టీడీపీ మహిళా నేత దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన ఫొటోలను దహనం చేయించారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. కొడాలి నాని..

కూతుళ్లను కూడా నాని అలాగే తిప్పుతున్నారా?
Divyavani

Updated on: Sep 10, 2020 | 6:53 PM

వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలినాని పై టీడీపీ మహిళా నేత దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన ఫొటోలను దహనం చేయించారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. కొడాలి నాని తన ఇద్దరు కూతుళ్లను కూడా  అలానే తిప్పుతున్నారా? అని ప్రశ్నించారు. జగన్ కోసం విజయమ్మ, షర్మిల రోడ్లమీదకు వచ్చారని… వారి గురించి టీడీపీ వాళ్లెప్పుడూ ఇంత అసహ్యంగా మాట్లాడలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న ప్రెసిడెంట్ మెడల్ మందు తాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా? అని ఆమె అన్నారు. తమ అధినేత చంద్రబాబు ముందు నాని ఒక బాతుబచ్చా అని విమర్శించారు. తన ఫొటోలకు అమరావతి మహిళలు శవయత్ర చేయడాన్ని చూసిన తర్వాత నానికి డిప్రెషన్ ఎక్కువైందన్నారు. నానికి ఎవరిని చూసినా పందులు, కుక్కలే గుర్తుకొస్తున్నాయని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై గతంలో రోజా, విడదల రజని వంటి వారు ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేశారో ఒక్కసారి వెనక్కివెళ్లి చూసుకోవాలని దివ్యవాణి అన్నారు రాజధాని రైతులకు, ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడానికి జగన్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆమె విమర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us