అదృష్టం అంటే ఇలా.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..

అదృష్టం అంటే ఇలా ఉండాలి. టాజానియాలో ఓ ఇలాంటి సూపర్ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. రెండు అరుదైన రాళ్ల‌తో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడైపోయిన టాంజానియా వ్య‌క్తి.. ఇప్పుడు ఆ దేశంలో..........

అదృష్టం అంటే ఇలా.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..

Tanzanian miner earns millions after second rare find : అదృష్టం అంటే ఇలా ఉండాలి. టాజానియాలో ఓ ఇలాంటి సూపర్ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. రెండు అరుదైన రాళ్ల‌తో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడైపోయిన టాంజానియా వ్య‌క్తి.. ఇప్పుడు ఆ దేశంలో సెలబ్రిటీగా మారిపోయాడు. గ‌నులు త‌వ్వే ప‌ని చేసుకుంటున్నఅత‌నికి ఓ రోజు రెండు పెద్ద రత్నాలు దొరిక‌డంతో కోటీశ్వ‌రుడిగా మారిపోయాడు.

అయితే తాజాగా ఆయ‌న‌కు మ‌రోసారి ర‌త్నం లభించింది. మ‌న్యారాలోని టాంజానియా గ‌నుల్లో ల‌భ్య‌మైన ఈ ర‌త్నం 6.3 కిలోల బ‌రువు తూగింది. దీని విలువ రెండు మిలియ‌న్ డాల‌ర్లుగా లెక్కగట్టారు. లైజ‌ర్‌కు తొలిసారిగా జూన్‌లోఇలాంటి అరుదైన ర‌త్నాలు రెండు దొర‌క‌గా వాటిని అక్కడి ప్ర‌భుత్వానికి విక్ర‌యించాడు. దీంతో సుమారు 25 కోట్ల వ‌ర‌కు సంపాదించి రాత్రికి రాత్రే.. ధ‌న‌వంతుడిగా మారిపోయాడు.

వీటినే ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు గుర్తించిన అతిపెద్ద టాంజానిట్ ర‌త్నాల‌ని స్వ‌యంగా ఆ దేశ గ‌నుల మంత్రిత్వ శాఖ ప్రకటించారు. అయితే ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయానా తన పాత స్టైల్‌ను మాత్రం వీడలేదట. ఎప్ప‌టిలాగే త‌న 2 వేల ఆవుల‌ను పెంచుకుంటూ జీవిస్తున్నాడట. తనకు లభించిన డబ్బులో కొంత మొత్తం తమ గ్రామంలో ఓ పాఠశాల కట్టించేందుకు వినియోగిస్తానని అన్నారు.

ఇత‌నికి న‌లుగురు భార్య‌లు, ముప్పై మంది పిల్ల‌లు.. కాగా ఈ భూమి మీదే అరుదైన‌విగా టాంజానైట్ ర‌త్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుప‌చ్చ‌, ఎరుపు, నీలం, ప‌ర్పుల్ రంగుల్లో మార్కెట్లో లభిస్తాయి. ఇతనికి లభించింది మాత్రం నీలం రంగులోని టాంజానైట్ రత్నంగా అక్కడి అధికారులు తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu