చంద్రబాబుపై తలసాని సెన్సేషనల్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని బాహుబలి సెట్టింగ్‌లు గ్రాఫిక్స్‌లతో గత ప్రభుత్వం.. టెంపరరీ బిల్డింగులు చూపించిందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి తలసాని.. గత టీడీపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. గత ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు రాజధాని సమస్య ఏర్పడిందన్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం తప్పు చేస్తే సలహాలు ఇవ్వాలి గానీ, ప్రజా తీర్పుకు వెళ్దామని చంద్రబాబు […]

చంద్రబాబుపై తలసాని సెన్సేషనల్ కామెంట్స్..

Edited By:

Updated on: Jan 16, 2020 | 11:08 AM

టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని బాహుబలి సెట్టింగ్‌లు గ్రాఫిక్స్‌లతో గత ప్రభుత్వం.. టెంపరరీ బిల్డింగులు చూపించిందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి తలసాని.. గత టీడీపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. గత ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు రాజధాని సమస్య ఏర్పడిందన్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం తప్పు చేస్తే సలహాలు ఇవ్వాలి గానీ, ప్రజా తీర్పుకు వెళ్దామని చంద్రబాబు అనడం సిగ్గుచేటంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం అమరావతిలోని రైతులు యుద్ధం చేయడానికి చంద్రబాబు నాయుడు బిక్షం ఎత్తుకోవడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో ప్రజలు చేసే ఉద్యమంలో.. చంద్రబాబు ఎంటరై నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులకు ఉద్యమం చేసే సత్తా ఉందని.. అక్కడి ప్రజలకు ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందన్నారు తలసాని.

Follow Us