Tadipatri Clashes: తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. తాడిపత్రిలో ఘర్షణలు, జేసీ బ్రదర్స్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. దాంతో పెద్దారెడ్డి.. ఆ మీటింగ్ అయిపోయాక సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సీఎంతో పెద్దరెడ్డి భేటీ అయితే తాడిపత్రి ఘటన, జేసీ బ్రదర్స్ నిరాహార దీక్షపై ఆయనకు వివరించే చాన్స్ కనిపిస్తోంది.
కాగా, గత పది రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రి అట్టుడుకిపోతోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణలతో ఆ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయం అక్కడి ప్రజల్లో నెలకొంది. మరోవైపు పోలీసులు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జేసీ బ్రదర్స్ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మరింత ఉద్రిక్తంగా మారింది. జేసీ బ్రదర్స్ దీక్ష నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ జేసీ బ్రదర్స్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు జేసీ బ్రదర్స్ దీక్షపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా తాడిపత్రి నిత్య ఘర్షణలతో అట్టుడికిపోతోంది.
Also read: