సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ..

ఐపీఎల్ 2020 సీజన్‌ని ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌కి మరో ఎదురుదెబ్బతగిలింది. ఆ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ..

Updated on: Sep 23, 2020 | 5:15 PM

Jason Holder Replaces : ఐపీఎల్ 2020 సీజన్‌ని ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌కి మరో ఎదురుదెబ్బతగిలింది. ఆ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో మార్ష్‌ గాయపడిన విషయం తెలిసిందే.


మ్యాచ్‌లో ఐదో ఓవర్ బౌలింగ్ చేసిన మిచెల్ మార్ష్.. బెంగళూరు ఓపెనర్ అరోన్ ఫించ్ హిట్ చేసిన బంతిని అందుకునే క్రమంలో పక్కకి డైవ్ చేశాడు. కానీ.. ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోవడంతో ఎడమకాలి చీలమండలానికి గాయమైంది. అయినప్పటికీ తర్వాత బంతిని వేసేందుకు రనప్ చేసుకుంటూ వచ్చిన మార్ష్.. నొప్పితో బంతిని విసరలేకపోయాడు. దాంతో.. మ్యాచ్ ఫిజియో సూచన మేరకు అతను ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు.

ఇప్పటికే మిడిలార్డర్‌ బలంగా లేని సన్‌రైజర్స్‌కు మార్ష్‌ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే. మార్ష్‌ స్థానంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

Loading...
Unable to load recommendations.
Follow Us