
కడప: మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన తండ్రి రాజారెడ్డి హత్య కేసు లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితమే సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్ జైలు నుంచి రాజారెడ్డి హత్య కేసు నిందుతుడు సుధాకర్ రెడ్డిని జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో అతనిపైనే వివేకా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి హత్య విషయంలో సుధాకర్ రెడ్డి చాలా కాలం పాటు జైలు శిక్ష అనుభవించాడు.
వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం రాత్రి 10:30 గంటల వరకూ ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి ఇంటికి చేరుకున్నారు. తెల్లవారు జామును పని మనుషులు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులకు ఫర్యాదు అందింది. అయితే పోస్ట్‌మార్టం అనంతరం వివేకాది హత్యేనని పోలీసులు తేల్చారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలయ్యాయని నివేదికలో తేలింది.