Door Step Service: మీరు డోర్‌ స్టెప్‌ సేవలు వినియోగించుకుంటున్నారా..? బ్యాంకులు విధించే ఛార్జీలు ఇవే!

Door Step Service: ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్ల కోసం బ్యాంకులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. బ్యాంకు వద్దకు వెళ్లి లావాదేవీలు..

Door Step Service: మీరు డోర్‌ స్టెప్‌ సేవలు వినియోగించుకుంటున్నారా..? బ్యాంకులు విధించే ఛార్జీలు ఇవే!
Follow us

|

Updated on: Jan 18, 2022 | 9:23 AM

Door Step Service: ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్ల కోసం బ్యాంకులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. బ్యాంకు వద్దకు వెళ్లి లావాదేవీలు జరుపుకోలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలో భాగంగా బ్యాంకుకు వెళ్లకుండానే ఇంటి వద్దనే బ్యాంకుకు సంబంధించిన సేవలు పొందవచ్చు. ఈ సేవలు పొందాలంటే ముందుగా బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా గానీ, ఫోన్‌ నెంబర్‌ ద్వారా గానీ సంప్రదించి సేవలు పొందవచ్చు. ఈ సేవలు పొందాలంటే కొంత చార్జీ విధిస్తుంటాయి బ్యాంకులు. స్టేట్‌ బ్యాంకుతో పాటు పలు బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సేవలు అందిస్తున్నాయి. వయసు మీద పడిన వారు, అనారోగ్యం కారణంగా బ్యాంకుకు వెళ్లలేని వారు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు డిపాజిట్‌, విత్‌డ్రా, చెక్‌ పికప్‌, స్లిప్‌ పికప్‌, ఫారం 15 హెచ్‌ పికప్‌, డ్రాఫ్ట్‌ డెలివరీ, లైఫ్‌ సర్టిఫికేట్‌, కేవైసీ తదితర సేవలు ఈ డోర్‌ స్టెప్‌ ద్వారా ఇంటి వద్దనే పొందవచ్చు.

బ్యాంకులు విధిన్న ఛార్జీలు:

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI):

ముందుగా ఈ డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే ముందుగా హోమ్‌ బ్రాంచ్‌కు అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికేతర లావాదేవీలకు రూ.60, జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ.100, జీఎస్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విజిట్‌లో రోజుకు రూ.20 వేల వరరకు నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. అలాగే విత్‌డ్రా చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ (HDFC):

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల ఈ డోర్‌ స్టెప్‌ సేవలు పొందాలంటే హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఒక్కో విజిట్‌కు గరిష్టంగా రూ.25 వేల వరకు, కనీసం రూ.5వేల నగదు విత్‌డ్రా, క్యాష్‌ పికప్‌ వంటి సేవలకు రూ.200, జీఎస్టీ ఛార్జ్‌ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇతర సేవలకు రూ.100, జీఎస్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే బ్యాంకు సిబ్బందిని అడిగితే తెలియజేస్తారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB):

ఇక పంజాబ్‌ నేషనల్ బ్యాంకు ఈ డోర్‌ స్టెప్‌ సేవలకు ఛార్జీలు విధిస్తుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌, అనారోగ్యం ఉన్న పెద్దవాళ్లు ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీలకు రూ.100+జీఎస్‌టి ఛార్జ్‌ చేస్తుంది బ్యాంకు.

ఇవి కూడా చదవండి:

Amazon, Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు.. పలు ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌

Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?

Latest Articles
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే