శ్రీశైలానికి భారీగా వరద నీరు

|

Aug 17, 2020 | 10:08 PM

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోతో జలాశయం నిండుకుండలా మారింది.

శ్రీశైలానికి భారీగా వరద నీరు
Follow us on

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,75,819 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 58,747 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 872.60 అడుగుల మేరకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 152.83 టీఎంసీల నీరు నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. అటు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.