Rama Navami: ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు చాలా ప్రత్యేకం.. ఎక్కడా చూసి ఉండరు..

హజరత్ నాగుల్ మీరా దర్గా లో గత రెండేళ్ల నుంచి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హజరత్ నాగుల్ మీరాను హిందూ ముస్లింలు ఆరాధ్య దైవంగా పూజించడం వల్ల హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని కళ్యాణమును ఈ దర్గాలో నిర్వహించి హిందూ ముస్లింల ఐక్యతను చాటి చెప్పారు. కుల మతాలకతీతంగా పూజింపబడుతున్న హజరత్ నాగుల్ మీరా తో పాటు...

Rama Navami: ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు చాలా ప్రత్యేకం.. ఎక్కడా చూసి ఉండరు..
Sri Rama Navami
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Apr 18, 2024 | 2:42 PM

దేశమంతా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే తెలంగాణలోని రెండో ప్రదేశాల్లో జరిగే వేడుకలు చాలా ప్రత్యేకమైనవి. ఇలాంటి వేడుక దేశంలో మరెక్కడా జరగదు. ఇంతకీ ఆ వేడుకల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం హిందూ, ముస్లింల ఆరాధ్య దైవం హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దర్గా మాలిక్ ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్వంలో మంత్రోత్సరణ మధ్యన కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

హజరత్ నాగుల్ మీరా దర్గా లో గత రెండేళ్ల నుంచి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హజరత్ నాగుల్ మీరాను హిందూ ముస్లింలు ఆరాధ్య దైవంగా పూజించడం వల్ల హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని కళ్యాణమును ఈ దర్గాలో నిర్వహించి హిందూ ముస్లింల ఐక్యతను చాటి చెప్పారు. కుల మతాలకతీతంగా పూజింపబడుతున్న హజరత్ నాగుల్ మీరా తో పాటు శ్రీరాముని కూడా హిందూ, ముస్లింలు పూజించడం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పవచ్చు.

శ్రీరామనవమి ముందు రోజు సత్యనారాయణపురం గ్రామ మహిళలు పిండి వంటల పాటు తలంబ్రాలను తయారుచేసి ఈ రోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన 8 కుటుంబాలు సీతా రాముల కళ్యాణం సందర్భంగా పీటల మీద కూర్చొని పూజలు చేశారు. రేపు దర్గాలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్టు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

అక్కడ సీతారాముల కళ్యాణం రాత్రి..

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి రోజు శ్రీరాముడి కళ్యాణం ఎక్కడైనా పగటి వేళల్లో నిర్వోహిస్తారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముతారం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడి కల్యాణం రాత్రి సాయం సంధ్య వేళల్లో నిర్వోహిoచటం విశేషం. ఈ ప్రాంతంలో లో రెండో భద్రాద్రిగా రామాలయానికి పెరోoదింది. ఆలయ విశిష్టతను తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలయాని సందర్శించి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆలయాని అభివృద్ధి చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముతారం గ్రామానికి చెందిన వనం కృష్ణదేవరాయులు ఆలయ నిర్మాణం చేపట్టారు. భద్రాచలంలో ప్రతి ఏటా జరిగే సీతారాముల కల్యాణానికి ముత్తారం నుండి గోటితో వలసిన తలంబ్రాలను కాలినడకతో వనం కృష్ణదేవరాయలు భద్రాచలం వెళ్లి కల్యాణ సమయానికి తలంబ్రాలు సమర్పించేవారు.

ఇలా జరుగుతున్న క్రమంలోనే వనం కృష్ణరాయలు వృద్ధాప్యంలో రావడంతో తాను ఒకానొక రోజు భద్రాచలం లో జరుగుతున్న సీతారాముల కల్యాణానికి వెళుతుండగా మార్గ మధ్యలో కి పోయే లోపులోనే కల్యాణం అయిపోవడంతో వనం కృష్ణరాయలు ఆవేదనతో వెనుతిరిగి సందర్భంలో కృష్ణరాయలు గారికి తన స్వప్నంలో శ్రీరాములు ప్రత్యక్షమై నీవు చింత చెందకు నేను మీ ఊరు వస్తా అని చెప్పారని చెప్తుంటారు.ఆరోజు నుండి ముత్తారంలో సాయంత్రం వేళలో మీ ఊర్లో లో కళ్యాణం జరిపించమని ఆజ్ఞాపించడంతో ఆ రోజు నుంచి ముత్తారం లో శ్రీ రామ కళ్యాణానికి కి తరిగి భద్రాచలంలో కల్యాణం కార్యక్రమం అనంతరం ఆనావ్యతిగా అక్కడ కళ్యాణ త్రంబ్రాలు తీసుకవచ్చి సాయం సంధ్యవేళ్ళ కత్రువులతో అంగరంగవైభవంగా ముత్తారం లో కల్యాణంకార్యక్రమం నిర్వహించేవారు.

అదే ఆనవాయితి తో ఇప్పుడు ముత్తారం లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సాయం సంధ్యవేళ్ళ జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం తిలకించడంకోసం భక్తులు చుట్టుపక్కల వివిధప్రాంతాల నుంచి ముతారం దేవాలయానికి తరలివస్తారు. సాయంసంధ్య వేళ్ళ జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ముత్తారం సీతారామచంద్ర దేవస్థానాన్ని ఈ ప్రాంతంలో లో రెండో భద్రాద్రిగా పిలుస్తారు. భద్రాచలంలో ఏవిధంగానైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఇక్కడ సాయి సంధ్య వేళలో అదేవిధంగా కళ్యాణం చేస్తూ ఉంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.