IPL 2020: ఆ విషయంలో ధోని తప్పేమీ లేదుః వార్నర్

|

Oct 18, 2020 | 11:01 AM

ఆ విషయంలో ధోని తప్పేమీ లేదని చెబుతూ.. తన మద్దతును తెలియజేశాడు. కొన్నిసార్లు కెప్టెన్లు తమ భావోద్వేగాలు కోల్పోతారని వార్నర్

IPL 2020: ఆ విషయంలో ధోని తప్పేమీ లేదుః వార్నర్
Follow us on

David Warner Defends Dhoni: ఐపీఎల్‌లో ఇటీవల జరిగిన ధోని- అంపైర్ పాల్ రీఫిల్ వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఆ విషయంలో ధోని తప్పేమీ లేదని చెబుతూ.. తన మద్దతును తెలియజేశాడు. కొన్నిసార్లు కెప్టెన్లు తమ భావోద్వేగాలు కోల్పోతారని వార్నర్ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఆ రోజు మ్యాచ్‌లో అంపైర్ బంతిని వైడ్‌గా పేర్కొని ఉంటే నిజంగానే ధోనికి కోపం వచ్చేది. అది వైడ్ డెలివరీయే కాబట్టి అలా ప్రకటించాలని అంపైర్ అనుకున్నాడు. కానీ అదే సమయంలో ధోనిని చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ధోని దిగ్గజ క్రికెటర్ కావడం వల్లే తాను ఇలా చెప్పట్లేదని.. ఈ విషయంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని వార్నర్ స్పష్టం చేశాడు. (IPL 2020)