ఆ చిన్నారుల పాలిట నిజమైన దేవుడు సోను సూద్

కష్టాల్లో ఉన్నవారి పాలిట దేవుడిగా మారిన సోను సూద్ మరోసారి తన దాతృత్వాన్ని ప్రదర్శించాడు.  లాక్‌డౌన్ సమయంలో  వేలాది మంది వలస కూలీలకు సహాయం చేసి దేవుడిగా మారాడు.  అప్పటినుంచి ఎక్కడ

ఆ చిన్నారుల పాలిట నిజమైన దేవుడు సోను సూద్

Updated on: Aug 17, 2020 | 9:01 PM

Sonu Sood on Arrange Travel  : కష్టాల్లో ఉన్నవారి పాలిట దేవుడిగా మారిన సోను సూద్ మరోసారి తన దాతృత్వాన్ని ప్రదర్శించాడు.  లాక్‌డౌన్ సమయంలో  వేలాది మంది వలస కూలీలకు సహాయం చేసి దేవుడిగా మారాడు.  అప్పటినుంచి ఎక్కడ సమస్య, సాయం పేరు విన్న వెంటనే స్పందిస్తూ వారికి చేయూతనిస్తున్నారు. అంతేగాక ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా సోను సూద్‌కు సోషల్‌ మీడియా వేదికగా మొర పెట్టుకుంటున్నారు.

దేశంలోనే కాకుండా విదేశాలలో చిక్కుకున్న వేలాది మందికి సహాయం చేసిన సోను సూద్ కనిపించే దేవుడిగా మారిపోయారు. ఇప్పుడు తాజాగా  ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి చెందిన 13 మంది చిన్నారులకు కొత్త జీవితం కల్పించేందుకు తన వంతు సహాయాన్ని అందించారు. చిన్నారులుకు  కాలేయం మార్పిడి చికిత్స కోసం సహాయం అందించారు.

ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన 13 మంది చిన్నారులు కాలేయం దెబ్బతినడంతో చికిత్స  అవసరం ఏర్పడింది. వీరంతా సంవత్సరంన్నర వయసున్న చిన్నారులు. ఈ 13 మంది పిల్లలను కాలేయ మార్పిడి కోసం మనీలా నుంచి భారత్‌ తీసుకువచ్చారు. సోను సూద్ కృషి కారణంగా ఈ పిల్లలు ప్రత్యేక విమానంలో రెండు రోజుల ముందు భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో వారికి అపోలో, ఢిల్లీలోని మాక్స్  ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి జరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us