తల్లి మరణవార్త విని కుప్పకూలిన తనయుడు, ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు

|

Nov 20, 2020 | 2:36 PM

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకుంది.  తల్లి మరణాన్ని తట్టుకోలేక తనయుడు కూడా తనువు చాలించాడు.

తల్లి మరణవార్త విని కుప్పకూలిన తనయుడు, ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు
Follow us on

కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకుంది.  తల్లి మరణాన్ని తట్టుకోలేక తనయుడు కూడా తనువు చాలించాడు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (75) బుధవారం రాత్రి అనారోగ్య కారణాలతో చనిపోయింది. కర్నూలులో ఉన్న కొడుకు రత్నమయ్య (39)కు తల్లి మరణించిన విషయం తెలిసింది. అప్పటికే ఆనారోగ్యంతో ఉన్న కుమారుడు ఈ విషాద వార్త విన్నవెంటనే ఒకసారిగా కుప్పకులిపోయాడు. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

గ్రామంలో తల్లి మృతదేహం ఉండగానే… తనయుడి మృతదేహం ఇంటికి రావడంతో  కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఎల్లమ్మకు ఆరుగురు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. రత్నమయ్యకు భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..