Sourav Ganguly : దాదా..పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు..ఇవాళ అమిత్​ షా తో సౌరవ్​ గంగూలీ భేటీ

|

Dec 28, 2020 | 1:25 PM

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగూలీ.. గవర్నర్​ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ ప్రవేశం చేస్తారన్న ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.అంతే కాదు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి గంగూలీ అంటూ కూడా ప్రచారం సాగుతోంది.

Sourav Ganguly : దాదా..పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు..ఇవాళ అమిత్​ షా తో సౌరవ్​ గంగూలీ భేటీ
Follow us on

బెంగాల్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది.  బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ కూడా కమలం వైపు వచ్చే అవకాశాలున్నాయని  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  దాదా ఆదివారం.. బంగాల్​ గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇవాళ.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలుస్తారని తెలుస్తోంది.

ఆదివారం సాయంత్రం.. బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​​తో ప్రత్యేకంగా గంగూలీ సమావేశం అయ్యారు. ఈ మాజీ క్రికెటర్​ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైంది.

అయితే రాజ్​భవన్​ వర్గాలు మాత్రం గంగూలీ.. మర్యాదపూర్వకంగానే గవర్నర్​ను కలిశారని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని పేర్కొన్నాయి. గవర్నర్​ కూడా కాసేపటికే ట్వీట్​ చేశారు. పురాతన క్రికెట్​ స్టేడియం ఈడెన్​ గార్డెన్స్​ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

అయితే బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగూలీ.. గవర్నర్​ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ ప్రవేశం చేస్తారన్న ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.అంతే కాదు గంగూలీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కూడా ప్రచారం సాగుతోంది. అమిత్​ షా తో భేటీ అవుతారా? పార్టీలో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.