అమ్మాయిగా ‘రోహిత్ శర్మ’.. చాహల్ షేర్ చేసిన ఫొటో చూశారా..!

| Edited By:

Jun 18, 2020 | 5:41 PM

టీమిండియా క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అమ్మాయిగా పుట్టి ఉంటే ఎలా ఉండేవారు..? ఏమో ఎవరు ఊహించగలరు. అయితే ఒకవేళ రోహిత్ అమ్మాయిగా పుట్టి ఉంటే ఇలానే ఉండేవారేమోనని అనిపించేలా

అమ్మాయిగా రోహిత్ శర్మ.. చాహల్ షేర్ చేసిన ఫొటో చూశారా..!
Follow us on

టీమిండియా క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అమ్మాయిగా పుట్టి ఉంటే ఎలా ఉండేవారు..? ఏమో ఎవరు ఊహించగలరు. అయితే ఒకవేళ రోహిత్ అమ్మాయిగా పుట్టి ఉంటే ఇలానే ఉండేవారేమోనని అనిపించేలా ఓ ఫొటోను షేర్ చేశారు యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ద్వారా రోహిత్ శర్మ ఫొటోను అమ్మాయిగా మార్చిన చాహల్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ‘చూడటానికి నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు రోహితా శర్మ భయ్యా” అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాదు ఆ పోస్ట్‌కి రోహిత్ శర్మని కూడా ట్యాగ్ చేశారు. ఇక ఈ ఫొటోకు నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుండగా.. అమ్మాయిగా కూడా రోహిత్ చాలా బావున్నారు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read This Story Also: ‘మామ ఇక లేడు’ అన్న మాటకు సుశాంత్ మేనల్లుడి భావోద్వేగ స్పందన