హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 60 శాతానికిపైగా హైదరాబాద్ మహానగరంలోనే నమోదయ్యాయి. నగరంలోని ఆరు ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:34 PM

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 60 శాతానికిపైగా హైదరాబాద్ మహానగరంలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది కేసీఆర్ సర్కార్.

సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్… ఈ ఆరు ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటేనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలో 21 జిల్లాలు ఇప్పుడు కరోనా వైరస్ ఫ్రీ జిల్లాలుగా మారాయి.

వచ్చే వారం రోజుల్లో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రబలిన ఈ ఆరు ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను, మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆరు ప్రాంతాల్లోని కరోనా కేసుల సంఖ్య ఆధారంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే వారం రోజుల్లో ఉత్పన్నమయ్యే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడెక్కడ.. ఎలాంటి సడలింపులు ఇవ్వాలి అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మే ఏడవ తేదీ నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మిగిలి ఉండే ప్రాంతాలలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu