ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నేటినుంచి ( జనవరి 27) ప్రారంభం కానున్నాయి. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది చైనా వేదికగా జరుగాల్సిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినవిషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ టోర్నీ థాయ్‌లాండ్‌లో జరుగనుంది. సీజన్ చివర్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడనుండగా.. కరోనా ఆందోళనతో జపాన్, చైనా షట్లర్లు టోర్నీకి దూరమయ్యారు. దాంతో ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న శ్రీకాంత్‌కు అవకాశం దక్కింది.
మరో వైపు ఇటీవల పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ప్రపంచ చాంపియన్ సింధు.. పోటీ తీవ్రంగా ఉండే ఈ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ క్వాలిఫికేషన్‌లో ఫస్ట్ ఈవెంట్ తర్వాత 17వ ర్యాంక్‌లో ఉన్న సింధు.. గత వారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరడంతో పదో ర్యాంక్‌కు చేరి బెర్తు దక్కించుకుంది. గతవారం థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో కొన్నిసార్లు రచనోక్‌పై సింధు పైచేయి సాధించింది. ఆ మ్యాచ్‌లో చేసిన మిస్టేక్స్‌ను సరిదిద్దుకుంటే మెరుగైన పెర్ఫామెన్స్ ఆశించొచ్చు. గతంలో ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న శ్రీకాంత్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. గాయం కారణంగా యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన అతడు, టొయొటా థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్‌కు కరోనా సోకడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈ ఇద్దరు ఈ మెగా టోర్నీలో ఎలా రాణిస్తారో చూస్తుండాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్