విశాఖజిల్లా సింహాచలంలో కొలువైఉన్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైకుంఠఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తకోటి భారీగా తరలి వచ్చి అప్పన్న దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఉదయం తెల్లవారుజామున ఆలయ ధర్మకర్త, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతి సింహాచలంలో అప్పన్న ఉత్తర ద్వార తొలిదర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనంలో కొలువై ఉన్న అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా ఉంటే, తాను వెళ్లేంతవరకు మీడియాని పంపించవద్దని అధికారులకు సంచయిత గజపతి హుకుం జారీ చేసిన నేపథ్యంలో దేవాలయంలో మీడియాకు చేదు అనుభవం ఎదురైంది.