Shraddha Srinath About Kaliyugam Movie: భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనుషుల్లో సహజంగానే ఉంటుంది. భవిష్యత్తుల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న లాంటి విశేషాలు ఆశ్చర్యంతోపాటు ఆసక్తిని కూడా కలిగిస్తాయి. ఇక ఇలాంటి కథాంశం నేపథ్యంలోనే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ కథాంశంతోనే సరికొత్త సినిమా తెరకెక్కుతోంది.
‘కలియుగం’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తమిళం, తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ భామ తెలుగులో పలు చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా తాను నటిస్తోన్న ‘కలియుగం’ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కలియుగం సినిమాను 2050లో భూమిపై సంభవించనున్న పరిణామాలు ఎలా ఉంటాయన్న కల్పిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. కలియుగం అంతంలో భూమి ఉంటుందా.? 2050 నాటికి భూమిపై పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారని శ్రద్ధా చెప్పుకొచ్చింది. మరి ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.
Also Read: Venkatesh Narappa: వేసవిలో వస్తానంటున్నవిక్టరీ వెంకటేశ్… నారప్ప విడుదల తేదీ ఎప్పుడంటే..?