అక్టోబర్‏లో పెళ్ళి.. డిసెంబర్‏లో ఆత్మహత్య.. తమిళ నటి చిత్ర కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు..

|

Dec 10, 2020 | 12:07 PM

తమిళ నటి చిత్ర ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగుళూరు- పూందమల్లి హైవేరోడ్డులోని ఈవీపీ ఫిలింసిటీలో పాండియన్ స్టోర్స్ షూటింగ్ కోసం వచ్చిన చిత్ర

అక్టోబర్‏లో పెళ్ళి.. డిసెంబర్‏లో ఆత్మహత్య.. తమిళ నటి చిత్ర కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు..
Follow us on

తమిళ నటి చిత్ర ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగుళూరు- పూందమల్లి హైవేరోడ్డులోని ఈవీపీ ఫిలింసిటీలో పాండియన్ స్టోర్స్ షూటింగ్ కోసం వచ్చిన చిత్ర ఓ ఫైవ్ స్టార్ హోటల్‏లో ఆత్మహత్య చేసుకున్నారు. తిరువళ్ళూరు ఆర్డీవో సమక్షంలో చిత్ర పోస్టుమార్టం జరుగుతుంది. కాగా ఈ నెల 4న ఓ షూటింగ్ కోసం చిత్ర హేమంత్‏తో కలిసి పూందమల్లి వచ్చింది. చిత్ర హేమంత్‏ను ప్రేమించి అక్టోబర్ 19న రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. చిత్ర హేమంత్ పెళ్ళి గురించి రిజిస్టార్ అధికారులు ఆమె ఇంట్లో చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. వీరిద్దరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు.

అయితే తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యే అంటూ ఆమె తండ్రి కామరాజ్ నషరత్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్ర మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ రూంలో వీరిద్ధరి మధ్య ఘర్షణ జరిగింటుందని  భావిస్తున్నారు.  దీనిపై ఆర్డీవో నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు హేమంత్‏ను ప్రశ్నిస్తున్నారు. తాను ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చి వెళ్ళగా చిత్ర ఉరివేసుకుందని హేమంత్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అటు హోటల్‏లోని సీసీ ఫుటేజ్‏ని పోలీసులు పరిశీలిస్తున్నారు.