షూట్ చేసి టార్గెట్ అయ్యాడు.. బీజేపీ నుంచి షూటర్ కపిల్ గుర్జార్ బహిష్కరణ.. చేరిన కాసేపటికే పనిష్మెంట్.

| Edited By: Anil kumar poka

Dec 30, 2020 | 7:12 PM

షాహీన్ బాగ్ షూటర్ కపిల్ గుర్జార్ కి చేదు అనుభవం ఎదురైంది. బీజేపీలో చేరిన కొన్ని గంటలకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

షూట్ చేసి టార్గెట్ అయ్యాడు.. బీజేపీ నుంచి షూటర్ కపిల్ గుర్జార్ బహిష్కరణ.. చేరిన కాసేపటికే పనిష్మెంట్.
Follow us on

షాహీన్ బాగ్ షూటర్ కపిల్ గుర్జార్ కి చేదు అనుభవం ఎదురైంది. బీజేపీలో చేరిన కొన్ని గంటలకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. సవరించిన పౌరసత్వ చట్టానికి (సీ ఏఏ కి)వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్దఆందోళన చేస్తున్న వారిని బెదిరించేందుకు ఇతడు తన గన్ తో గాలిలో కాల్పులు జరిపి పరారయ్యాడు. బీజేపీ అనుకూల నినాదాలు చేశాడు. పోలీసులు ఇతడిని వెంటనే అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేశారు. అయితే యూపీలోని ఘజియాబాద్ లో  కపిల్ బుధవారం…  బీజేపీ నేతలు, సభ్యుల సమక్షంలో పార్టీలో చేరాడు. ఈ విషయం తెలియగానే పార్టీ అధిష్టానం ఘజియాబాద్ సభ్యులను  తీవ్రంగా మందలించి పార్టీ నుంచి ఇతడిని బహిష్కరించింది. కాగా కపిల్ గుర్జార్ గత చరిత్ర గురించి తమకు తెలియదని, హిందుత్వ కోసం  పని చేస్తానని చెప్పినందుకే పార్టీలో చేర్చుకున్నామని ఘజియాబాద్ బీజేపీ నేతలు తెలిపారు. ఈ విషయం ముందే తెలిసి ఉంటే చేర్చుకునేవాళ్ళం కామన్నారు.