యుఎస్ ఓపెన్ కోసం రెడీ అవుతోన్న టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా..టాప్‌సీడ్ ఓపెన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ఓపెన్ క్వార్టర్స్‌లో శుక్రవారం దారుణ పరాజయం ఎదుర్కుంది. ఈమెపై 1-6, 6-4, 7-6 పాయింట్ల తేడాతో 116వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ గెలుపొందింది. గత ఎనిమిదేళ్లలో 100కు పైగా ర్యాంక్ ఉన్న ఓ క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం సెరెనాకు ఇదే మొదటిసారి. తన కెరీర్లో 967 సింగిల్స్ మ్యాచ్‌లాడిన సెరెనా విలియమ్స్.. ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే 100 లేదా అంతకంటే పెద్ద ర్యాంకర్ చేతిలో పరాజయం చవిచూసింది.
Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్పష్టత