South Korea: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. ఆ దేశంలో మరోసారి స్కూల్స్ బంద్.. ఎప్పటివరకు అంటే.?

కరోనా మహమ్మారి కారణంగా మనుషుల జీవితాలు తలక్రిందులు అయ్యాయి. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.

South Korea: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. ఆ దేశంలో మరోసారి స్కూల్స్ బంద్.. ఎప్పటివరకు అంటే.?

Updated on: Dec 14, 2020 | 12:55 PM

Schools Shut Down: కరోనా మహమ్మారి కారణంగా మనుషుల జీవితాలు తలక్రిందులు అయ్యాయి. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది. భారత్‌తో పాటు అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి వల్ల స్కూల్స్, విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీనితో ఆయా ప్రభుత్వాలు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యను బోధిస్తున్నారు. ఇక ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే ఈసారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. దీనితో అక్కడి ప్రభుత్వాలు పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ కూడా విధించారు.

ఇదిలా ఉంటే దక్షిణ కొరియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం రాజధాని సియోల్‌లో మంగళవారం నుంచి స్కూల్స్, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నమోదైన పాజిటివ్ కేసుల కంటే ఈసారి గరిష్టస్థాయికి చేరుకుంటుండటంతో ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే ఇది కాస్తా ఆసియాలోని నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చునని నిపుణులు అంటున్నారు.

Also Read:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

Follow Us