తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు దొరకని దర్శనభాగ్యం

పాడు కరోనా... భగవంతుడికి .. భక్తుడికి మధ్య దూరాన్ని ఆమాంతం పెంచేసింది.. పెంచేయడమేమిటి ..? అసలు భక్తులకు భగవంతుడి దర్శనాలే లేకుండా చేసింది.. నెలవారీ పూజ కార్యక్రమాల కోసం ఇవాళ శబరిమల ఆలయాన్ని తెరిచినా భక్తులకు మాత్రం అనుమతి లేదని తేల్చేశారు ఆలయ అధికారులు.

తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు దొరకని దర్శనభాగ్యం

Updated on: Aug 17, 2020 | 7:26 PM

పాడు కరోనా… భగవంతుడికి .. భక్తుడికి మధ్య దూరాన్ని ఆమాంతం పెంచేసింది.. పెంచేయడమేమిటి ..? అసలు భక్తులకు భగవంతుడి దర్శనాలే లేకుండా చేసింది.. నెలవారీ పూజ కార్యక్రమాల కోసం ఇవాళ శబరిమల ఆలయాన్ని తెరిచినా భక్తులకు మాత్రం అనుమతి లేదని తేల్చేశారు ఆలయ అధికారులు.. అయిదు రోజుల పాటు సాగే ఈ పూజా కార్యక్రమాలు 21న సాయంత్రం ముగుస్తాయి.. ఆ తర్వాత ఆలయాన్ని మూసేస్తారు.. మలయాళ కొత్త సంవత్సరం ఆరంభం నేపథ్యంలో శబరిమల తప్ప మిగతా వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచే ఉంచాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. మిగతా ఆలయాల సంగతేమిటో కానీ.. శబరిమల ఆలయం తెరిస్తే మాత్రం పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు.. అప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.. ఈ కారణంగానే శబరిమల ఆలయాన్ని మూసేస్తున్నారు.. కేరళవాసులకు అత్యంత ఇష్టమైన పండుగైన ఓనం సందర్భంగా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండు వరకు ప్రత్యేక పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారంతే! అప్పుడు కూడా భక్తులకు అనుమతి ఉండదు..