దుమ్మురేపుతున్న ‘రోపోసో’.. రెండు రోజుల్లోనే 2 కోట్లకు పైగా యూజర్లు..

| Edited By:

Jul 06, 2020 | 5:57 AM

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన తర్వాత భారత కంపెనీల పంట పండింది. గురుగ్రామ్‌కు చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘రోపోసో’ అయితే డౌన్‌లోడ్లలో

దుమ్మురేపుతున్న ‘రోపోసో’.. రెండు రోజుల్లోనే 2 కోట్లకు పైగా యూజర్లు..
Follow us on

Roposo: గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన తర్వాత భారత కంపెనీల పంట పండింది. గురుగ్రామ్‌కు చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘రోపోసో’ అయితే డౌన్‌లోడ్లలో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా 22 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2014లో ఈ యాప్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉంది. నెలకు 80 వేలకు పైగా వీడియోలు క్రియేట్ అవుతున్నాయి.

59 చైనా యాప్‌ల నిషేధం తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ ట్రెండింగ్ యాప్‌లలో ఒకటిగా నిలించింది. గత మూడు రోజులుగా అయితే ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం సగటును గంటలకు ఆరు లక్షల డౌన్‌లోడ్స్ అవుతున్నట్టు రోపోసో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మయాంక్ భంగాడియా తెలిపారు. రోపోసోతో పాటు ఇతర ఇండియన్ యాప్స్ అయిన షేర్‌చాట్, చింగారీ, మిత్రోన్‌ తదితర వాటి డౌన్‌లోడ్లు కూడా బాగా పెరిగాయి.