Australia vs India 3rd Test : ఆస్ట్రేలియాపై ఏ క్రికెటర్ సాధించని అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో తలపడుతుంది టీమిండియా. కెప్టెన్ స్మిత్ చెలరేగడంతో 338 టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది ఆసీస్. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో..
Australia vs India 3rd Test : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో తలపడుతుంది టీమిండియా. కెప్టెన్ స్మిత్ చెలరేగడంతో 338 టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది ఆసీస్. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్ 196 బంతుల్లో 91, స్టీవ్‌స్మిత్ 226 బంతుల్లో 131 పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టింది. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 77 బంతుల్లో 3 ఫోర్లు ఒక్కసిక్స్ తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శుభ్‌మన్‌గిల్ 101 బంతుల్లో 8 ఫోర్లు తో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ ను నెలకొలిపాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ 100 సిక్సర్లను కొట్టాడు. ఇంత వరకూ ఏ క్రికెటర్ కూడా ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు కొట్టలేదు. వన్డేల్లోనే ఆసీస్‌పై రోహిత్ 63 సిక్స్‌లు కొట్టాడు. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రోహిత్ కొట్టిన ఒక్క సిక్స్ తో ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సిక్స్‌తో ఇంటర్నేషన్ క్రికెట్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరుకుంది.