మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చి చెప్పిన పరిశోధకులు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు మురుగు నీటిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చి చెప్పిన పరిశోధకులు..
Follow us

|

Updated on: Aug 19, 2020 | 7:22 PM

Researchers Find Corona Genes In Sewage: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. సైన్స్ వరల్డ్‌కు అంతుచిక్కని ఈ వైరస్‌పై తాజాగా చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు మురుగు నీటిలో ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్‌లోని మురుగునీటి శుభ్రపరిచే కేంద్రాల నుండి వివిధ నమూనాలను సేకరించి.. వాటిల్లో కరోనా జన్యువులు ఉన్నట్లు గుర్తించామని  సీసీయంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. కరోనా వైరస్ సోకినవారి ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా వైరస్ శరీరం నుంచి మురుగునీటి క్వాల్లోకి చేరుతుందని తెలిపారు. మురుగు నీటి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉందని.. ఆ మురుగు నీటిని బయటికి రాకుండా కంటైన్ చేయలేకపోతే మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు.

దీంతో వృథా జలాల్లో కరోనా ఆనవాళ్లు కనిపిస్తే ఆ ప్రాంతంలో కరోనా కేసులు బయటపడనప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఉన్నట్లు గుర్తించొచ్చని పరిశోధకులు తెలిపారు. కరోనా సోకినవారి నుంచి 35 రోజుల వరకూ వైరస్ విడుదల అవుతుందని స్పష్టం చేశారు. సుమారు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు నిర్ధారించారు. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సారధ్యంలో ఉదయ్ కిరణ్ , కుంచా సంతోష్ కుమార్, మనుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట మోహన్‌లు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.

Latest Articles