హైదరాబాద్‌లో బెస్ట్ లైవ్ మ్యూజిక్ రెస్టారెంట్‌లు..
TV9 Telugu
17 May 2024
ఫిల్మ్ నగర్ లో ఉన్న మూన్‌షైన్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో చాలా కాలంగా ఉన్న ప్రదేశం మరియు గొప్ప బ్యాండ్‌లకు ప్రసిద్ధి చెందింది.
పోష్ నోష్ హైదరాబాద్‌లో బెస్ట్ లైవ్ మ్యూజిక్ రెస్టారెంట్‌ల్లో ఒకటి. రుచికరమైన భారతీయ, చైనీస్, ఇటాలియన్ వంటకాలు ఉన్నాయి. ఇది జూబ్లీ హిల్స్ Cbi కాలనీలో ఉంది.
జూబ్లీ హిల్స్ రోడ్ 36లో ఉన్న కెమిస్ట్రీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రదేశాలలో ఒకటి. ఇది రుచికరమైన భారతీయ, ఇటాలియన్, ఆసియా వంటకాలను అందిస్తుంది.
SKYHY లైవ్ గచ్చిబౌలిలో ఉన్న ఒక రెస్టారెంట్. చైనీస్, కాంటినెంటల్ ఆహారాన్ని అందిస్తారు.మెనూలో ఆహారం, పానీయాలలో చాలా ఎంపికలు ఉన్నాయి.
ఆమ్నెసియా జూబ్లీ హిల్స్‌లో ఉన్న లాంజ్ బార్.ఇక్కడ అమెరికన్, ఆసియా ఆహారాన్ని అందిస్తారు. ఫుడ్ మెనలో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి.
స్టోన్ వాటర్స్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న కిచెన్, లాంజ్.ఇది ఉత్తర భారతీయ, ఆసియా, కాంటినెంటల్ ఆహారాన్ని అందిస్తుంది.
టబుల రస మెనూలో రుచికరమైన నార్త్ ఇండియన్, ఆసియన్ మరియు కాంటినెంటల్ వంటకాలను అందిస్తారు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ 35లో ఉంది.
ఓడియం బై ప్రిజం మెనూలో నార్త్ ఇండియన్, చైనీస్ వంటకాలను అందిస్తారు.మధ్యాహ్నం 3:30 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంది. గండిపేటలో ఉంది.