అత్యంత ఖరీదైన కారులో రియా చక్రవర్తి

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి చుట్టు ముంబై సినిమా వార్తలు తిరుగుతున్నాయి. దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..

అత్యంత ఖరీదైన కారులో రియా చక్రవర్తి

Updated on: Aug 08, 2020 | 5:34 AM

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి చుట్టు ముంబై సినిమా వార్తలు తిరుగుతున్నాయి. దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడి కార్యాలయాని​కి వచ్చారు. ఆ సమయంలో రియా వచ్చిన వాహనంపై అందరి దృష్టి పడింది.

రియా అత్యంత ఖరీదైన ఫోర్డ్ ఎడీవోర్‌లో కారులో రావడంతో.. రియాకు అంత ఖరీదైన లగ్జరీ కారు ఎక్కడదనే దానిపై అంతా చర్చను జరుగుతోంది. అయితే రియా వచ్చిన ఆ కారు ఆమెది కాదని వెల్లడైంది. ముంబైకి చెందిన ప్రముఖ స్టార్‌ హోటల్స్‌ వ్యవస్థాపకుడు సువేద్ లోహియాదిగా  అంతా తేల్చారు. అతడు సల్మాన్ ఖాన్ 2014 చిత్రం ‘జై హో’లో ఓ చిన్న పాత్రను పోషించాడు. అభిషేక్ కపూర్ ‘ఆర్యన్: అన్‌ బ్రేకబుల్‌’లో కూడా నటించాడు. అయితే సువేద్‌ చిత్ర పరిశ్రమలో చాలా మందికి సుపరిచితుడిగా పేరుంది. వివిధ కార్యక్రమాల్లో నటీనటులతో కలిసి తీసుకున్న ఫొటోలను తరచూ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us