మా ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ.. హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్

| Edited By: Anil kumar poka

Apr 26, 2020 | 5:27 PM

కరోనా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ తమ ప్లాస్మాను ఇచ్చేందుకు సిధ్ధమని ప్రకటించారు. కరోనా వైరస్ ను నివారించేందుకు, చికిత్సకు ఉపయోగపడే వ్యాక్సీన్ తయారీకి మా రక్తాన్ని ఇస్తామని వారు తెలిపారు. వీరు గత నెలలో ఆస్ట్రేలియాలో ఉండగా..

మా ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ.. హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్
Follow us on

కరోనా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ తమ ప్లాస్మాను ఇచ్చేందుకు సిధ్ధమని ప్రకటించారు. కరోనా వైరస్ ను నివారించేందుకు, చికిత్సకు ఉపయోగపడే వ్యాక్సీన్ తయారీకి మా రక్తాన్ని ఇస్తామని వారు తెలిపారు. వీరు గత నెలలో ఆస్ట్రేలియాలో ఉండగా.. కరోనా బారిన పడ్డారు. అయితే 14 రోజులు క్వారంటైన్ లో ఉండి.. చికిత్స పొంది కోలుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక విమానంలో లాస్ ఏంజిలిస్ వెళ్లిపోయారు. వ్యాక్సీన్ తయారీ రీసెర్చ్ కి తోడ్పడేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నామని, చివరకు ఈ నిర్ణయానికి వచ్చామని టామ్ హాంక్స్ తెలిపారు. ఈ వ్యాక్సీన్ ని  తన పేరిట ‘హ్యాన్ క్సీన్ ‘ అని వ్యవహరిస్తే సంతోషిస్తానని ఆయన చమత్కరించారు. తమకు ఎక్కడ, ఎవరి వల్ల ఈ వైరస్ అంటుకుందో తెలియడంలేదని రీటా విల్సన్ అన్నారు. ఆస్ట్రేలియాలో తమకు మంచి చికిత్స లభించిందని ఆమె వెల్లడించారు. కాగా-ఇప్పటికే కరోనా చికిత్సకు ఉపయోగపడే వ్యాక్సీన్ తయారీకోసం రీసెర్చర్లు కృషి చేస్తున్నారు. అయితే ఇవి ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నాయి.