RCB vs SRH తేలిపోయిన బెంగళూరు..సన్‌రైజర్స్ టార్గెట్ 121

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అదరగొట్టారు. సందీప్‌ శర్మ(2/20), జేసన్‌ హోల్డర్‌(2/27) ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 120 పరుగుకే పరిమితమైంది.

RCB vs SRH తేలిపోయిన బెంగళూరు..సన్‌రైజర్స్ టార్గెట్ 121

Updated on: Oct 31, 2020 | 10:05 PM

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అదరగొట్టారు. సందీప్‌ శర్మ(2/20), జేసన్‌ హోల్డర్‌(2/27) ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 120 పరుగుకే పరిమితమైంది. ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌(32: 31 బంతుల్లో 4ఫోర్లు) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించారు. ఏబీ డివిలియర్స్‌(24), వాషింగ్టన్‌ సుందర్‌(21) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఆరంభం నుంచే హైదరాబాద్‌ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. పరుగులు చేసేందుకు బ్యాట్స్‌మెన్‌ తెగ కష్టపడ్డారు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌(5), విరాట్‌ కోహ్లీ(7) విఫలమయ్యారు. ఇక డెత్‌ ఓవర్లలో కూడా బెంగళూరు సత్తా చాటలేకపోయింది. గుర్‌కీరత్‌ సింగ్‌ ఆఖరి వరకు క్రీజులో ఉన్నా 24 బంతుల్లో కేవలం 15  రన్సే చేశాడు. నటరాజన్‌(1/11) బెంగళూరును బాగా ఇబ్బంది పెట్టాడు. నదీమ్‌(1/35), రషీద్‌ ఖాన్‌(1/24) కూడా పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

 

Also Read :

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Bheem For Ramaraju : యూట్యూబ్​లో సరికొత్త రికార్డు