ఈ నాణేం ఖరీదు ఏకంగా రూ.9.10 కోట్లు.!

1937 వ సంవత్సరం బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ముద్రించిన అరుదైన బంగారు నాణేం ఇటీవల జరిగిన వేలంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.9.10 కోట్లకు దక్కించుకున్నాడు. ఆరు కాయిన్స్‌లో ఒకటైన ఇది ఎడ్వర్డ్ 1936లో రాజుగా ఉన్న సమయంలో తయారు చేయబడింది. ఇవి 1937, జనవరి 1 నుంచి అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కింగ్ ఎడ్వర్డ్ అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తన సింహాసనాన్నే త్యాగం చేయడంతో వీటి ఉత్పత్తి ఆగిపోయిందని […]

ఈ నాణేం ఖరీదు ఏకంగా రూ.9.10 కోట్లు.!
Follow us

|

Updated on: Jan 19, 2020 | 2:23 PM

1937 వ సంవత్సరం బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ముద్రించిన అరుదైన బంగారు నాణేం ఇటీవల జరిగిన వేలంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.9.10 కోట్లకు దక్కించుకున్నాడు. ఆరు కాయిన్స్‌లో ఒకటైన ఇది ఎడ్వర్డ్ 1936లో రాజుగా ఉన్న సమయంలో తయారు చేయబడింది. ఇవి 1937, జనవరి 1 నుంచి అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కింగ్ ఎడ్వర్డ్ అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తన సింహాసనాన్నే త్యాగం చేయడంతో వీటి ఉత్పత్తి ఆగిపోయిందని అంటుంటారు.

ఇక లండన్ మ్యూజియం నిర్వాహకురాలు ఒకరు మాట్లాడుతూ.. ‘ఎడ్వర్డ్ బొమ్మ కలిగిన ఈ కాయిన్స్ ప్రపంచంలోనే అరుదైనవని అన్నారు. ఇలాంటివి ఆరు నాణేలు మాత్రమే ఉండగా.. అందులో నాలుగు తమ మ్యూజియంలో ఉన్నాయని.. మిగతా రెండు ప్రైవేట్ వ్యక్తుల సొంతం చేసుకున్నారని తెలిపారు.