నడుం బిగించిన రాములమ్మ.!

ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తులు ఆన్ లైన్ అంటూ ప్రారంభించిన నమోదు ప్రక్రియపై టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతోందని.. ఆ విషయం ప్రచార మాధ్యమాలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయని ఆమె విమర్శించారు. సాంకేతిక సమస్యలు ఒకవైపు, శిక్షణలేని సిబ్బందితో మరోవైపు… చివరికి వేదన మాత్రం ప్రజలకు అంటూ ట్విట్టర్ లో విమర్శించారు. ఇప్పటికిప్పుడు పన్నులు చెల్లిస్తేనే ఆస్తులు ఆన్ లైన్ చేస్తామన్న హెచ్చరికలతో ఒకవైపు, […]

నడుం బిగించిన రాములమ్మ.!

Updated on: Oct 09, 2020 | 10:31 PM

ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తులు ఆన్ లైన్ అంటూ ప్రారంభించిన నమోదు ప్రక్రియపై టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతోందని.. ఆ విషయం ప్రచార మాధ్యమాలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయని ఆమె విమర్శించారు. సాంకేతిక సమస్యలు ఒకవైపు, శిక్షణలేని సిబ్బందితో మరోవైపు… చివరికి వేదన మాత్రం ప్రజలకు అంటూ ట్విట్టర్ లో విమర్శించారు. ఇప్పటికిప్పుడు పన్నులు చెల్లిస్తేనే ఆస్తులు ఆన్ లైన్ చేస్తామన్న హెచ్చరికలతో ఒకవైపు, ఎంతోకొంత ముట్టచెబితేనే కానీ నమోదు చేసుకోమనే బెదిరింపులు మరోవైపుతో గ్రామీణ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆమె తెలిపారు.

మరోవైపు, గాంధీలో, నిమ్స్ లో కరోనా యోధుల ధర్నాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయని, ఇవి చాలక డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల వెతలు, రైతుల ఆవేదన… ఇలా సమస్యలకు అంతేలేదని విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మొత్తంమ్మీద పాలకవర్గం తప్ప మరే వర్గం ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయని .. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆర్ఎస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉప ఎన్నికపైనే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిది అని హితవు పలికారు రాములమ్మ.

Loading...
Unable to load recommendations.
Follow Us