Pacer Jaydev Unadkat married : టీమిండియా మరో ఓ ఇంటివాడయ్యాడు. క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ తన దగ్గరి బంధువు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. రినీ కంటారియా అనే యువతిని జయదేవ్ పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్ ట్వీట్ చేశాడు.
2.02.2021! ❤️ pic.twitter.com/J9wAop6gMO
— Jaydev Unadkat (@JUnadkat) February 3, 2021
వివాహ సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. 2010లో క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనద్కత్, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో భారత జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి:
CSK New Title Sponsor : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్స్పాన్సర్గా ‘స్కోడా’..
మాట నిలబెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తూ..