తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ విడుదల కానున్న నాగ్ సినిమా.. క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న చిత్రం.

|

Dec 21, 2020 | 9:34 PM

నాగార్జున హీరోగా నటించిన రాజన్న చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. తెలుగులో విడుదలైన దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రం తమిళంలో విడుదల కానుంది.

తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ విడుదల కానున్న నాగ్ సినిమా.. క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న చిత్రం.
Follow us on

rajanna releasing in tamil: నాగార్జున హీరోగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2011లో వచ్చిన రాజన్న మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవ వీరుడిగా నాగ్ ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమిళంలో విడుదల కానుంది.
రాజసింగమ్ పేరుతో లక్ష్మీ లోటస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేశారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా గురించి నిర్మాత ఎస్‌జీఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు. చారిత్రక కథలతో నిర్మించే చిత్రాలు తమిళ నాట విజయవంతమవుతున్నాయని, ఆ కోవలోనే ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందని చెప్పుకొచ్చారు. మరి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న రాజన్న తమిళంలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.