‘అవసరమైతే మోహన్ భగవత్ ను కూడా ఉగ్రవాది అంటారు’, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మోదీ పై ఫైర్

ఇండియాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ కి వ్యతిరేకులుగా నిలిచినవారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. .

అవసరమైతే మోహన్ భగవత్ ను కూడా ఉగ్రవాది అంటారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మోదీ పై ఫైర్

Edited By:

Updated on: Dec 24, 2020 | 2:03 PM

ఇండియాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ కి వ్యతిరేకులుగా నిలిచినవారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. . క్రోనీ పెట్టుబడిదారుల కోసం మోదీ సొమ్ములు సేకరిస్తున్నారని అన్నారు. మోదీని ఎవరు విమర్శించినా..వారు రైతులు గానీ, లేబర్ గానీ, చివరకు ఆర్ ఎస్ ఎస్  చీఫ్ మోహన్ భగవత్ అయినా సరే..వారిని టెర్రరిస్టులుగా పేర్కొంటారని రాహుల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మోదీ అసమర్థులు, ఏదీ అర్థం చేసుకోలేరు అన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 2 కోట్ల సంతకాలతో సేకరించిన మెమోరాండం ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి సమర్పించి వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో ప్రజాస్వామ్యం అన్నది ఉందనుకోవడం భ్రమ మాత్రమే అన్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంట్ ఉభయ సభలను వెంటనే సమావేశపరచాలని ఆయన కోరారు.

ఈ చట్టాలు కోట్లాది రైతుల మనుగడను దెబ్బ తీస్తున్నాయి. కేవలం నలుగురైదుగురు వ్యాపారవేత్తల ప్రయోజనాలకోసమే తెచ్చారు అని రాహుల్ ఆరోపించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us