అతనికి విషమిస్తారా ? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం

తన రాజకీయ ప్రత్యర్థి, క్రిటిక్ అయిన అలెక్సీ నావెల్నీ పై విషప్రయోగం జరగడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.  అలెక్సీ విమానం ఎక్కబోయే ముందు..

అతనికి విషమిస్తారా ? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం

Edited By:

Updated on: Aug 20, 2020 | 8:35 PM

తన రాజకీయ ప్రత్యర్థి, క్రిటిక్ అయిన అలెక్సీ నావెల్నీ పై విషప్రయోగం జరగడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.  అలెక్సీ విమానం ఎక్కబోయే ముందు ఆయనకు ఇచ్చిన టీ లో విషం కలిపినట్టు భావిస్తున్నామని అలెక్సీ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. విమానాశ్రయంలో తీవ్రమైన బాధతో మెలికలు తిరుగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన అలెక్సీ ని వెంటనే ఆయన సహచరులు, సిబ్బంది స్ట్రెచర్ పై ఆసుపత్రికి తరలించారు. 44 ఏళ్ళ అలెక్సీ త్వరగా కోలుకోవాలని క్రెమ్లిన్ కోరుతోంది. ఆయన కోమాలో వెంటిలేటర్ పై ఉన్నారని డాక్టర్లు తెలిపారు. తమ దేశంలో ఆందోళనకారులను రెచ్చగొట్టేందుకు ఇతడే కారణమని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ విష ప్రయోగం జరగడం సంచలనం రేపింది.

అయితే ఆయనపై ఈ ప్రయోగం జరిగిందనడానికి ఖఛ్చితమైన ఆధారాలు లేవని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కొవ్ అంటున్నారు. ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నారు.

Video Credits: Daily Mail